విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని-శ్రీ శ్రీనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై ఎనిమిదేళ్లుగా నిర్వహస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో పాల్గొనడం చాల ఆనందంగా ఉందని కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ రమణ మూర్తి ఆనందం వ్యక్తం చేసారు. శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో భాగంగా జీవీఎంసీ 27 వ వార్డు పరిధి శ్రీనగర్ జానకీరామ వీధిలో ఆదివారం ఏర్పాటుచేసిన భారీ అన్నదాన కార్యక్రమానికి డాక్టర్ రమణమూర్తి హాజరై భక్తులకు అన్న ప్రసాదం వడ్డన చేసారు.ముందుగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా రమణ మూర్తి మాట్లాడుతూ గణపతి ఉత్సవాలను పురస్కరించుకుని కమిటీ సభ్యులు ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించడంతో పాటు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.శ్రీ శ్రీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు,మాజీ కార్పొరేటర్ గోలగాని వీరరావు (బుజ్జి) మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిదేళ్లుగా నిర్విరామంగా శ్రీవరసిద్ధి వినాయక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ నెల 14 న విగ్రహ ప్రతిష్ట చేసామని,ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు




0 Comments