విశాఖ వన్టౌ న్ ఏరియా కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల 150 సంవత్సరాల చరిత్ర గల పురాతన కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరుగుచున్న వాసవి వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం గణపతికి భక్తులచే లక్ష గరిక పూజ మరియు గణపతి హోమం దేవాలయ ఆస్థానాచార్యులు ఆర్.బి.బి.కుమారశర్మ నేతృత్వంలో నిర్వహించినట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు శ్రీయుతులు ఆరిశెట్టి దినకర్, పెనుగొండ వెంకట రాజు కోశాధికారి దోమా వెంకట బాలాజీకుమార్ ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ సందర్భంగా దేవాలయంలో సాయంకాలం గణపతి పూజలో భాగంగా విద్యార్థులచే సహశ్ర కలములతో (పెన్నులతో) ప్రత్యేక పూజ నిర్వహించారు. దేవాలయ ప్రధాన పూజారి ఆర్.బి.బి. కుమారశర్మ మాట్లాడుతూ విద్యార్ధులు గణపతికి పెన్నులతో ఆరాధిస్తే వారి విధ్యాభాసం మరింత వృద్దిచెందుతుందని గణపతి పూజలో వుంచిన కలం తో పరీక్షలు వ్రాసినచో వారు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని నమ్మకం అని అన్నారు. మండవిల్లి వెంకట సరయ్య గారు సమర్పించిన కలములతో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం విద్యార్థులకు ఇస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మెన్ ఆదిమూలం తిరుపతిరావు, పాలూరి వెంకట అశోక్ కుమార్, పూసర్ల సుధీర్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments