మహారాష్ట్ర మండల్ గణేష్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్


ఆసిల్ మెట్ట, సీబీఎం కాంపౌండ్‌లోని మహారాష్ట్ర మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ మహా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలకు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల  వేసిన అనంతరం గణనాథునికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా హారతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర మండల్ సభ్యులు, భక్తులు, కమిటీ ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు.

గణేష్ ఉత్సవాలు ప్రజల్లో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మహారాష్ట్ర మండల్ ఆధ్వర్యంలో సంప్రదాయాలను కొనసాగిస్తూ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ ఉమా మహేష్ గారు , సీనియర్ నాయకులు శ్రీ సత్యనారాయణ గారు, హరి గారు,  గణేష్ గారు,స్థానిక  జనసేన వార్డు అధ్యక్షులు చంటి గారు,38 వార్డు అధ్యక్షులు అరుణ్ గారు, యువనేత రాజేష్ గారు, మహేష్ గారు, శ్రీధర్ గారు, మహారాష్ట్ర మండల్ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం అక్కయ్యపాలెం సాధికారణలో టిడిపి సీనియర్ నేత శ్రీ హనీప్ గారి కుమారుని వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

Post a Comment

0 Comments