వందేమాతరం సామూహిక గానంతో మార్మోగిన బీవీకే జూనియర్ కళాశాల,విశాలాక్షినగర్

Dr Nanduri Ramakrishna Sr Sub Editor 
విశాఖపట్నం, సెప్టెంబర్ 25:అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ – విద్యాభారతి ఆధ్వర్యంలో బీవీకే జూనియర్ కళాశాల, విశాలాక్షినగర్ ప్రాంగణంలో శుక్రవారం “వందేమాతరం సామూహిక గానం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది, స్థానిక సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కె. శివ రామకృష్ణ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు.

అతిథి వక్తగా శ్రీ గరిమెళ్ల రాధాకృష్ణ గారు,విభాగ్ సంయోజక్, సమరసత సేవా ఫౌండేషన్ పాల్గొని, వందేమాతరం గీతం యొక్క చారిత్రక ప్రాధాన్యతను, భారతీయులలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో దాని పాత్రను వివరించారు.


గౌరవ అతిథిగా శ్రీ వి. రామ సత్యనారాయణ గారు,కార్యదర్శి, Bharateeya Vidya Kendram పాల్గొన్నారు. విద్యార్థులు దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యతతో కూడిన ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

అలాగే శ్రీ తరణి చరణ్ ఉపాధ్యాయ గారు, మాజీ డైరెక్టర్, BARC ప్రత్యేక అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు.

అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు స్థానిక సమాజ సభ్యులు కలిసి వందేమాతరం సామూహిక గానం నిర్వహించారు. వందేమాతరం గానంతో కళాశాల ప్రాంగణం దేశభక్తి, జాతీయ ఐక్యతా స్ఫూర్తితో మార్మోగింది.

ఈ కార్యక్రమాన్ని బీవీకే Correspondent డా. నండూరి రామకృష్ణ గారి మార్గదర్శకత్వంలో, Principal డా. ఆర్. ఇందిరా సంయుక్త గారిఆధ్వర్యంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.

విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ చైతన్యం, సామాజిక బాధ్యత మరియు సమైక్యతా భావాలను పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని కళాశాల యాజమాన్యం పేర్కొంది.

Post a Comment

0 Comments