భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం* పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా మోది పాలన!


ఈరోజు 25-09-2026 శుక్రవారం ఉదయం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పరశు రామ రాజు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి గారి పరిపాలన సాగుతోందని అన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతం ఏకాత్మ మానవతావాదమే లక్ష్యంగా మోది పరిపాలిస్తున్నారని కొనియాడారు. ఈ విధానం వలన ప్రభుత్వ పథకాలు చిట్ట చివర నున్న పౌరుని వరకు చేరాలనే సంకల్పంతో పనిచేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి SVS ప్రకాష్ రెడ్డి, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ KNP చక్రవర్తి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ T కోటేశ్వర రావు, T సుబ్బరామి రెడ్డి మరియు జిల్లా పదాధికారులు, కార్యకర్తలు పాల్గొని దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Post a Comment

0 Comments