వన్ ఆఫ‌ర్‌- వన్ ఆస్క్‌పై స‌మీక్ష‌ -పాన్ ఐఐటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మిట్ 2026 - క్యాంప‌స్‌, అనుబంధ క‌ళాశాల‌ల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం



ఏయూక్యాంప‌స్‌ -వ‌న్ ఆఫ‌ర్‌-వ‌న్ ఆస్క్‌లో భాగంగా ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, అనుబంధ క‌ళాశాల‌ల నుంచి రెండు ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని, దీనికి వ‌ర్త‌మాన ప్రాధాన్య‌త క‌లిగిన అంశాల‌నుంచి ప్ర‌తిపాద‌న‌లు అందించాల‌ని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ అన్నారు. బుధ‌వారం మ‌ద్యాహ్నం ఏయూ స‌మావేశ మందిరంలో ఆయ‌న ఏయూ ఆచార్యుల‌తో ప్ర‌త్య‌క్షంగా, అనుబంధ క‌ళాశాల‌ల, క్ల‌స్ట‌ర్ క‌ళాశాలల‌ ప్రిన్సిపాల్స్‌తో వ‌ర్చువ‌ల్ విధానంలో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా వివిధ క్ల‌స్ట‌ర్ క‌ళాశాల‌లు  త‌మ‌కు కేటాయించిన క‌ళాశాల‌ల‌తో క‌ల‌సి వ‌న్ ఆఫ‌ర్‌- వ‌న్ ఆస్క్‌లో అందించే ప్ర‌తిపాద‌న‌ల‌ను వివ‌రించారు. వీటిని లిఖిత పూర్వ‌కంగా ఏయూకు పంపాల‌ని వీటిలో అత్యుత్త‌మ‌మైన‌ది ఎంపిక చేసి ప్ర‌భుత్వానికి పంపుతామ‌న్నారు. అదే విధంగా విశ్వ‌విద్యాల‌యంనుంచి ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, స్పేస్ టెక్నాల‌జీ, క్వాంటం టెక్నాల‌జీ, ఏఐ టెక్నాల‌జీ, ఫార్మ‌శీ, ఎంఎల్.ఆర్ త‌దిత‌ర విభాగాల నుంచి ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆచార్యులు వివ‌రించారు. వీటిలో అత్యుత్త‌మమైన‌వి ఎంపిక చేసి వ‌ర్సిటీ నుంచి ప్ర‌భుత్వానికి పంప‌నున్నారు. ఆచార్యుల నుంచి ప‌లు సూచ‌న‌లు అడిగి తీసుకున్నారు. అదే విధంగా ప్రోటోటైప్ లో త‌మ ప్రాజెక్టులు చేసిన విద్యార్థుల వివ‌రాల‌ను సైతం అందించాల‌ని వీసీ సూచించారు. వీటిలో అత్యుత్త‌మ ప్ర‌జెక్టుల‌ను ఎంపిక చేస్తామ‌న్నారు. 


రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన విజ‌య‌వాడ‌లో డాక్ట‌ర్ బి.ఆర్ అంబేద్క‌ర్ క‌ళా వేదికలో పాన్ ఐఐటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2026 స‌మిట్‌ను నిర్వ‌హిస్తోంద‌న్నారు. దీనికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొంటార‌న్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ స‌ద‌స్సును ఏయూ క్యాంపస్‌లోని విభాగాలు, అనుబంధ క‌ళాశాల‌ల‌లో ప్ర‌త్య‌క్ష‌ ప్ర‌సారం అందించే విధంగా కృషి చేస్తున్నామ‌న్నారు. కొర్పొరేట్ సంస్థ‌ల సిఈఓలు, ఇన్వెస్ట‌ర్‌లు, వెంచ‌ర్ క్యాప‌ట‌లిస్ట్‌లు, ఐఐటి డైరెక్ట‌ర్లు-గ్లోబ‌ల్ ఆలుమ్ని, విధాన క‌ర్త‌లు, స్టార్ట‌ప్ ఫౌండ‌ర్లు స‌మిట్‌లో పాల్గొంటార‌న్నారు. స్వ‌ర్ణాంధ్ర 2047, విక‌సిత్ భార‌త్ 2047 కి అనుగుణంగా భ‌విష్య‌త్తుకు అవ‌స‌ర‌మైన ఇనోవేష‌న్ వ్య‌వ‌స్థ‌ల‌ను రూప‌క‌ల్ప‌న చేసే విధంగా ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారని వివ‌రించారు. ఆచార్యుల‌కు, విద్యార్థుల‌కు దిశానిర్ధేశం చేసే విధంగా, ఉప‌యుక్తంగా నిల‌చే ఈ స‌ద‌స్సులో క‌ళాశాల‌లు, విద్యార్థులు భాగం కావాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో ప్రిన్సిపాల్స్‌, విభాగాధిప‌తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments