విశాఖపట్నం:విశాఖ సందేశం: వర్తవాహని :2టౌన్ అస్సాం గార్డెన్స్ప్రా శ్రీ మహాచండి దేవిగా ఉమాదేవి అమ్మవారు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగాగల దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ శివరామకృష్ణ దేవాలయంలో ఆలయ ఈవో శివకేశవరావు సారధ్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా రంభమయ్యాయి 4వ రోజున శ్రీ ఉమాదేవి అమ్మవారు శ్రీ మహాచండి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు జి భార్గవ శర్మ శైవాగమ సాంప్రదాయంలో కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించి ధూప దీప నైవేద్య మంగళ హారతి మంత్రపుష్పములు భక్తిశ్రద్ధలతో సమర్పించారు . సన్నిధిలో మహిళలచే సామూహికంగా శ్రీ లలితా సహస్రనామం పారాయణం జరిగింది . అనంతరం విచ్చేసిన భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదములు అందజేశారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు ఎం వి రాజశేఖర్ , మహిళలు స్థానికులు పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు
0 Comments