విశాఖపట్నం: విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) తరపున ప్రముఖ సినీ నిర్మాత, ప్రముఖ రియాల్టర్, కంచర్ల మీడియా అధినేత కంచర్ల అచ్యుతరావు సతీమణి సుబ్బలక్ష్మి బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు బిసివై రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తో కంచర్ల అచ్యుతరావు మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కంచర్ల అచ్యుతరావు ఇప్పటికే విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని 120మంది కార్పొరేటర్ల లిస్టు సిద్ధం చేసినట్లు, ఆ జాబితాను అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విశాఖపట్నం మేయర్ గా గెలుపొందేందుకు తనకున్న అవకాశాలు, సమగ్ర ప్రణాళిక యాదవ్ ముందు ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ భేటీలో విశాఖపట్నం మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందువల్ల బిసివై అభ్యర్థిగా కంచర్ల అచ్యుతరావు సతీమణి సుబ్బలక్ష్మి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి, రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
0 Comments