డాక్టర్. జహీర్ అహ్మద్ గారి సేవా కార్యక్రమాలు అన్నదానం, వస్త్ర దానం, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ...


వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్. జహీర్ అహ్మద్ గారి పుట్టినరోజు వేడుకలను వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో మక్సుద్ గారు  ఘనంగా నిర్వహించారు. 

ముందుగా వివేకానంద సంస్థ ట్యూషన్ విద్యార్థులతో కలిసి డాక్టర్ గారు కేక్ కటింగ్ చేశారు. సంస్థ మహిళా సభ్యులు డాక్టర్ గారిని శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు విద్యార్థులకు పుస్తకాలు, వృద్ధులకు వస్త్రాలు , పేద మహిళలకు నిత్యాసర వస్తువులను డాక్టర్ పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ సంస్థ మాజీ చైర్మన్, డాక్టర్ గారి తనయులు మక్సుద్ అహ్మద్ గారు, వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు అప్పలకొండ, సత్తిబాబు మరియుT. కృష్ణ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments