అమరావతి :ఏపీ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమిలోని జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం సీట్లలో 35% స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో 6-8 మేయర్, దాదాపు 40 మున్సిపల్ ఛైర్మన్, సుమారు 1,800 వార్డు స్థానాలు ఉన్నాయి. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

0 Comments