ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.రేపు ఉదయం 11:30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
రేపే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.అన్ని జిల్లాల నుంచి గెజిట్ నోటిఫికేషన్లు ఎన్నికల సంఘానికి చేరినట్లు సమాచారం. ఎన్నికల నగారా మోగనుందా?అధికారిక ప్రకటన వెలువడితే ఎన్నికల తేదీలు, నోటిఫికేషన్ వివరాలపై స్పష్టత రానుంది.
అధికారిక ధృవీకరణ వచ్చే వరకు ఈ సమాచారాన్ని నిర్ధారిత వార్తగా భావించవద్దు.

0 Comments