విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో శ్రమదానం మరియు పరిశుభ్రత తనిఖీలను చేసిన జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాథుర్*  'ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' జాతీయ పిలుపు మేరకు భారీ ఎత్తున శ్రమదానం నిర్వహణ  8వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై రైడ్-ఆన్ మెకనైజ్డ్ క్లీనింగ్ మెషీన్లు, స్క్రబ్బింగ్ పరికరాలను స్వయంగా పరిశీలించిన జీఎం  అత్యాధునిక ఎలక్ట్రికల్/సోలార్ ఆధారిత స్మార్ట్ కాంపాక్షన్ చెత్తబుట్టను ప్రారంభించిన సఫాయి మిత్ర  సీసీటీవీ కెమెరాల ద్వారా స్టేషన్‌లో చెత్త వేయకుండా కఠిన నిఘాకు ఆదేశం  ముడసర్లోవలోని నూతన జోనల్ ప్రధాన కార్యాలయంలో 'ఏక్ పేడ్ మా కే నామ్' మొక్కలు నాటే కార్యక్రమం ప్రణాళిక దేశవ్యాప్త 'స్వచ్ఛతా హీ సేవా' (SHS) – 2026 పిలుపునకు అనుగుణంగా, దక్షిణ కోస్తా రైల్వే (SCoR) ఈరోజు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో బృహత్ పరిశుభ్రత మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. 'ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' అనే జాతీయ నినాదంతో నిర్వహించిన శ్రమదానంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాథుర్ స్వయంగా పాల్గొని ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌‌మెంట్స్ (PHODs), సీనియర్ అధికారులు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమగ్ర పరిశుభ్రతా కార్యక్రమం జ్ఞానాపురం సర్క్యులేటింగ్ మరియు స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ప్రారంభమై, సర్క్యులేటింగ్ మార్గాలు మరియు పరిసర ప్రాంతాలలో కొనసాగింది. శ్రమదానం అనంతరం జనరల్ మేనేజర్ స్టేషన్ అంతటా పరిశుభ్రతను క్షుణ్ణంగా తనిఖీ చేశారు; ప్రత్యేకించి 8వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై దృష్టి సారించారు. సాంప్రదాయ పద్ధతుల కంటే యాంత్రిక పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ, స్టేషన్ శానిటేషన్ పరికరాల పనితీరును శ్రీ సందీప్ మాథుర్ స్వయంగా పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్లాట్‌ఫారమ్ ఉపరితలాలను వేగంగా మరియు నిరంతరాయంగా శుభ్రపరిచేందుకు సహాయపడే రైడ్-ఆన్ హెవీ డ్యూటీ స్క్రబ్బర్-డ్రైయర్లు, హై-ప్రెజర్ జెట్ క్లీనర్లు మరియు మెకనైజ్డ్ ఫ్లోర్ స్వీపర్ల పనితీరును ఆయన సమీక్షించారు. ప్లాట్‌ఫారమ్‌లు ఎల్లప్పుడూ మెరుస్తూ, ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం లభించేలా వాటి నిర్వహణ సామర్థ్యాన్ని, రసాయన రహిత స్క్రబ్బింగ్ విధానాలను మరియు నిర్వహణ కాలపట్టికలను జనరల్ మేనేజర్ తనిఖీ చేశారు. జీఎం శ్రీ సందీప్ మాథుర్ సమక్షంలో, స్టేషన్‌కు చెందిన ఒక సఫాయి మిత్ర చేతుల మీదుగా నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ కాంపాక్షన్ లిట్టర్ బిన్ (చెత్తబుట్ట) సదుపాయం లాంఛనంగా ప్రారంభించబడింది. మంచినీటి బూత్‌లు, వెయిటింగ్ హాళ్లు, క్యాటరింగ్ స్టాళ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మరియు రైల్వే ట్రాక్‌లతో సహా ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించే కీలక ప్రాంతాలను శ్రీ మాథుర్ తనిఖీ చేశారు. చెత్త ఉత్పత్తి అయ్యే చోటే వేరు చేయడం (segregation at source), దాని నిర్వహణ మరియు తుది పారబోత ప్రక్రియలను సమీక్షిస్తూ, ఆధునిక, శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని అధికారులను ఆదేశించారు.


విశాఖపట్నం 'ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' జాతీయ పిలుపు మేరకు భారీ ఎత్తున శ్రమదానం నిర్వహణ

 8వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై రైడ్-ఆన్ మెకనైజ్డ్ క్లీనింగ్ మెషీన్లు, స్క్రబ్బింగ్ పరికరాలను స్వయంగా పరిశీలించిన జీఎం

 అత్యాధునిక ఎలక్ట్రికల్/సోలార్ ఆధారిత స్మార్ట్ కాంపాక్షన్ చెత్తబుట్టను ప్రారంభించిన సఫాయి మిత్ర

 సీసీటీవీ కెమెరాల ద్వారా స్టేషన్‌లో చెత్త వేయకుండా కఠిన నిఘాకు ఆదేశం

 ముడసర్లోవలోని నూతన జోనల్ ప్రధాన కార్యాలయంలో 'ఏక్ పేడ్ మా కే నామ్' మొక్కలు నాటే కార్యక్రమం ప్రణాళిక

దేశవ్యాప్త 'స్వచ్ఛతా హీ సేవా' (SHS) – 2026 పిలుపునకు అనుగుణంగా, దక్షిణ కోస్తా రైల్వే (SCoR) ఈరోజు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో బృహత్ పరిశుభ్రత మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. 'ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' అనే జాతీయ నినాదంతో నిర్వహించిన శ్రమదానంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాథుర్ స్వయంగా పాల్గొని ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌‌మెంట్స్ (PHODs), సీనియర్ అధికారులు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సమగ్ర పరిశుభ్రతా కార్యక్రమం జ్ఞానాపురం సర్క్యులేటింగ్ మరియు స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ప్రారంభమై, సర్క్యులేటింగ్ మార్గాలు మరియు పరిసర ప్రాంతాలలో కొనసాగింది. శ్రమదానం అనంతరం జనరల్ మేనేజర్ స్టేషన్ అంతటా పరిశుభ్రతను క్షుణ్ణంగా తనిఖీ చేశారు; ప్రత్యేకించి 8వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై దృష్టి సారించారు.

సాంప్రదాయ పద్ధతుల కంటే యాంత్రిక పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ, స్టేషన్ శానిటేషన్ పరికరాల పనితీరును శ్రీ సందీప్ మాథుర్ స్వయంగా పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్లాట్‌ఫారమ్ ఉపరితలాలను వేగంగా మరియు నిరంతరాయంగా శుభ్రపరిచేందుకు సహాయపడే రైడ్-ఆన్ హెవీ డ్యూటీ స్క్రబ్బర్-డ్రైయర్లు, హై-ప్రెజర్ జెట్ క్లీనర్లు మరియు మెకనైజ్డ్ ఫ్లోర్ స్వీపర్ల పనితీరును ఆయన సమీక్షించారు. ప్లాట్‌ఫారమ్‌లు ఎల్లప్పుడూ మెరుస్తూ, ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం లభించేలా వాటి నిర్వహణ సామర్థ్యాన్ని, రసాయన రహిత స్క్రబ్బింగ్ విధానాలను మరియు నిర్వహణ కాలపట్టికలను జనరల్ మేనేజర్ తనిఖీ చేశారు.

జీఎం శ్రీ సందీప్ మాథుర్ సమక్షంలో, స్టేషన్‌కు చెందిన ఒక సఫాయి మిత్ర చేతుల మీదుగా నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ కాంపాక్షన్ లిట్టర్ బిన్ (చెత్తబుట్ట) సదుపాయం లాంఛనంగా ప్రారంభించబడింది.


మంచినీటి బూత్‌లు, వెయిటింగ్ హాళ్లు, క్యాటరింగ్ స్టాళ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మరియు రైల్వే ట్రాక్‌లతో సహా ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించే కీలక ప్రాంతాలను శ్రీ మాథుర్ తనిఖీ చేశారు. చెత్త ఉత్పత్తి అయ్యే చోటే వేరు చేయడం (segregation at source), దాని నిర్వహణ మరియు తుది పారబోత ప్రక్రియలను సమీక్షిస్తూ, ఆధునిక, శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని అధికారులను ఆదేశించారు.

బాధ్యతారాహిత్యంగా చెత్త వేయడాన్ని అరికట్టేందుకు, స్టేషన్ సీసీటీవీ నిఘా వ్యవస్థ ద్వారా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని మరియు నిబంధనలు ఉల్లంఘించే వారికి తక్షణ జరిమానాలు (స్పాట్ ఫైన్లు) విధించాలని స్టేషన్ యంత్రాంగాన్ని, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)ను జనరల్ మేనేజర్ ఆదేశించారు.

తనిఖీల సమయంలో జనరల్ మేనేజర్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉన్న ప్రయాణికులతో నేరుగా సంభాషించి, స్టేషన్ పరిశుభ్రత మరియు సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్‌‌లు, ప్రాంగణాల్లో చెత్త వేయకుండా కేటాయించిన ప్రత్యేక చెత్తబుట్టలను మాత్రమే ఉపయోగిస్తూ, స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగస్వాములు కావాలని ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా, స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా, దక్షిణ కోస్తా రైల్వే ఆధ్వర్యంలో 'ఏక్ పేడ్ మా కే నామ్' కింద విశాఖపట్నంలోని ముడసర్లోవలో కొత్తగా నిర్మిస్తున్న జోనల్ కార్యాలయ భవన సముదాయంలో రేపు (02.10.2026న) భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడుతుంది.

Post a Comment

0 Comments