అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం – 2026 థీమ్: “ఏజింగ్ విత్ డిగ్నిటీ” (Aging with Dignity)


విశాఖపట్నం, అక్టోబర్ 1, 2026:ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. వృద్ధుల జనాభా ఎదుర్కొంటున్న అవకాశాలు, సవాళ్లపై అవగాహన పెంపొందించడం, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.

కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వివిధ ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా:

* జిల్లా ఆసుపత్రిలోని జెరియాట్రిక్ క్లినిక్‌ల ద్వారా అక్టోబర్ నెలలో 1,000 మంది వృద్ధులకు సమగ్ర వృద్ధాప్య ఆరోగ్య పరీక్షలు (Comprehensive Geriatric Assessment) నిర్వహించనున్నారు.

* అన్ని PHCలలో మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 1న వృద్ధుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించి, వృద్ధులకు అందుబాటులో ఉన్న వృద్ధాప్య ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు.

* ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాల్లో (Health & Wellness Centres) CHOలు వృద్ధులను గుర్తించి, వృద్ధాప్య ఆరోగ్యం, సంరక్షణ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఆరోగ్య విద్యను అందించనున్నారు.

* వృద్ధుల్లో మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ టెలి-మానస్ సేవలు – టోల్ ఫ్రీ నంబర్ 14416 గురించి తెలియజేయనున్నారు.

* జిల్లా వృద్ధాప్య ఆరోగ్య బృందం, NCD మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సులు, ఫిజియోథెరపిస్టులు, MRWలు తదితర సిబ్బంది కలిసి NCDలు, మానసిక ఆరోగ్యం, శారీరక వైకల్యాలు మరియు ఇతర వృద్ధాప్య ఆరోగ్య సమస్యలపై హెల్త్ టాక్ సెషన్లు నిర్వహించనున్నారు.

జీవీఎంసీ ఓల్డ్ ఏజ్ వృద్ధాశ్రమంలో ఆరోగ్య పరీక్షలు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. పి. జగదీశ్వర రావు గారి సూచనల మేరకు, PO, NCD & RBSK డా. హారిక గారు, మెడికల్ ఆఫీసర్ మరియు వైద్య సిబ్బందితో కలిసి రామాటాకీస్ సమీపంలోని గోల్డెన్ ఏజ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వృద్ధులకు రక్తపోటు (BP), రక్తంలో చక్కెర (Blood Sugar) మరియు ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, NCDల నియంత్రణ, మానసిక ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారులు, NCD సిబ్బంది మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


                 డా. పి. జగదీశ్వర రావు

            జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

                     విశాఖపట్నం జిల్లా

Post a Comment

0 Comments