జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,


విశాఖపట్నం :ఈ రోజు అనగా తేది. 11.10.2026 న అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి అధ్యక్షతన పి.ఎం. పాలెం పట్టణ ఆరోగ్య కేంద్రము లో సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఈ సమావేశంలో డా. పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా లో పి. ఎం. పాలెం ఏరియా లో బాలికల నిష్పత్తి తక్కువగా ఉండడం వలన

 ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియచేసారు.  బాలికలను ఉద్దేశించి డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ బాలురు మరియు బాలికల నిష్పత్తి సమానంగా ఉండాలని మన విశాఖ జిల్లాలో ప్రతీ 1000 మంది బాలురకు 941 బాలికలు కలరని, ఈ నిష్పత్తి సమానంగా ఉండేలా చూడాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. మరియు PC&PNDT Act ప్రకారం ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రములన్ని కూడా లింగ నిర్దారణ పరీక్షలు చేయరాదని, నిబందనలు అతిక్రమించినచో కఠినమైన చర్యలు తీసుకొనబడునని మరియు బాలికలు అన్ని రంగాలలోను ముందున్నారని, ఆడపిల్లల పట్ల వివక్షతకు తావు లేకుండా ప్రతీ ఒక్కరూ కృషి చేసినప్పుడే అడా మగ వ్యత్యాసాలు తొలగిపోతాయని  తెలియచేసారు 

శ్రీమతి శ్రీదేవి ఐసిడిఎస్ సిడిపిఒ వారు మాట్లాడుతూ సేవ్ గర్ల్ చైల్డ్ ను ఉద్దేశించి లింగ వివక్షత ఉండరాదని, బాలికలు ధైర్యంగా ప్రతీ విషయాన్ని ఎదుర్కోవాలని తెలియచేసారు. 

డా.లూసీ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి వారు మాట్లాడుతూ బాలురు, బాలికలు సమానమని మరియు ఈ సంవత్సరం థీమ్ ను ఉద్దేశించి స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఉండాలని స్త్రీ చదువుకుంటే ఆ ఇంటిలో అందరికీ చదువుతో పాటు జ్ఞానం అలవడుతుందని తెలియచేసారు.

స్త్రీ, పురుషుల నిష్పత్తి సమానంగా ఉండాలని మరియు బాలికలు సంకుచిత భావం విడనాడి భవిష్యత్తు కు పునాది వేసుకోవాలని స్త్రీ కూడా అన్ని రంగాలలో పురుషులతో సమానంగా విజయం సాదిస్తుందని తెలియచేసారు.     

శ్రీ.బి.నాగేశ్వర రావు, డెమో వారు మాట్లాడుతూ బాలికల హక్కులు ఉల్లంఘనకు వ్యతిరేఖంగా ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్ళను ప్రపంచానికి తెలియచేయడానికి అక్టోబర్ 11, 2012 నుండి ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నారు. బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించటానికి లింగ వివక్ష రూపుమాపటానికి మహిళా సాధికారత కోసం పోరాటం అనేది బాలికా దినోత్సవం లక్ష్యం. ఈ ఏడాది స్టాప్ సెక్స్ సెలక్షన్ - సేవ్ గర్ల్ చైల్డ్ అనే థీమ్ తో అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకొంటున్నామని తెలియచేసారు.

తదుపరి పి. ఎం పాలెం పట్టణ ఆరోగ్య కేంద్రం నుండి లాస్ట్ బస్టాప్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డా. పి జగదీశ్వర రావు వారు జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. 

ఈ ర్యాలీ లో డా.లూసీ, జిల్లా వ్యాది నిరోధక టీకాల అధికారి, శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో, శ్రీమతి శ్రీదేవి, ఐసిడిఎస్ సిడిపిఒ, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, ఏ.ఎన్.ఎం లు, ఆశా కార్యకర్తలు, ట్రైనీ నర్స్లు,  మరియు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

              జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

                           విశాఖపట్నం

Post a Comment

0 Comments