విశాఖపట్నం పాతనగరంలో కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల కన్యకాపరమేశ్వరి అమ్మవారి బాలాలయంలో ఈ నెల 10 తేదీ నుండి 20వ తేదీ వరకు వాసవిదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుచున్నట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు శ్రీయుతులు ఆరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు, కోశాధికారి బాలాజికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వయంగా అమ్మవారిని దర్శించుకుని పూజాదికాలతో పాటు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలు ముందుగా దేవాలయంలో సంప్రదించి నమోదు చేసుకొనిన యెడల వారి పేరున శరన్నవరాత్రుల్లో ప్రతీరోజు పూజాదికాలు నిర్వహించుటకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయానికి ప్రధాన భాగాలైన ధ్వజస్తంభం, నవగ్రహ మండపం పోయినందున అమ్మవారి ఆలయం పునర్నిర్మించవలసి వున్నందున నూతనంగా ఏర్పాటుచేసిన బాలాలయం లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రత్యేక పంచామృతాభిషేకాలు , స్వర్ణపుష్ప పూజ, చండీ హోమం వంటి కార్యక్రమాలు, మరియు మహిళలచే సామూహిక సువాసిని పూజలు నిర్వహిస్తునట్లు తెలిపారు.
ఈ శరన్నవరాత్రుల్లో దేవాలయంలో అమ్మవారి దర్శనం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనం కలిగిస్తున్నట్లు తెలిపారు.
శరన్నవరాత్రుల ప్రారంభ సూచికగా 11వ తేది ఉదయం 6గంటలకు కన్యకాపరమేశ్వరి అమ్మవారి పల్లకీ ఊరేగింపు కలశం చేతబట్టిన108 మంది మహిళలచే కనకమహాలక్ష్మి గుడి నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
*ఉత్సవాల్లో భాగంగా 16వ తేది శుక్రవారం నాడు సుమారు 1200 మంది విధ్యార్దులచే సరస్వతి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.*
దేవాలయ సమావేశ మందిరంలో జరిగిన ఉత్సవ నిర్వహణ కమిటీ సమావేశంలో వాసవిదేవి శరన్నవరాత్రులకు సంబంధించిన కరపత్రాలను దేవాలయ సంఘ సలహాదారుడు శ్రీ బొడ్డు రఘు గారి స్వహస్తములతో విడుదల చేసినట్లు తెలిపారు.
ఈ శరన్నవరాత్రులలో సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నృత్యం, కళారూపాల ప్రదర్శనలు భజన కార్యక్రమములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో నిర్వహణ కమిటీ అధ్యక్షులు శ్రీయుతులు వై.వి.వి.విశ్వనాధ్, పి.ఎస్.ఆర్.కిషోర్, ఉసిరికల రామకృష్ణ మరియు మహిళా కమిటి సభ్యులు కడిమిశెట్టి దంతేశ్వరి, కొత్తా లక్ష్మి, కొత్తా ఉమాకుమారి, కుంచం నాగమణి, కొప్పాక లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
అన్ని కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కమ్మని కోరారు.

0 Comments