వివేకానంద సంస్థ వారు ప్రతిరోజు నిత్య అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఈ నారాయణ సేవలో భాగంగా ఈరోజు లలిత కుమారి గారు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, ప్రతిరోజు మధ్యాహ్నం ,రాత్రి వేళ ఉచిత నిత్య అన్నదానాలు నిర్వహిస్తున్నామని, ఈ నారాయణ సేవలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చెన్న. ఎల్లాజీ, గురుమూర్తి పాల్గొని నారాయణ సేవలను అందించారు.
0 Comments