. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం...ముషిణి రామకృష్ణారావు, ఎస్. కె.ఎన్.మణి దంపతులు గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ అనేక సేవలందిస్తూ కార్యకర్తలు గా,నాయకులుగా కాంగ్రెస్ లో అభిమానం సంపాదించుకుని అనేక పదవులు చేపట్టి అధిష్టానం ద్రుష్టిని ఆకర్షించి నేడు అమలాపురం పట్టణ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ అందజేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి,గిడుగు రుద్రరాజు, జిల్లా అధ్యక్షులు కొత్తూరు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఒంటెద్దు బాబి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమలాపురం పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కరించాలంటే వాటిపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని అలాంటి అవగాహన ఒక లాయర్ గా పనిచేస్తూ అమలాపురం పట్టణ అభివృద్ధికై పనిచేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాలకు ఇష్టపడి చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని అమలాపురం దశాదిశ మార్చే విధంగా డ్రైన్లు, రోడ్లు వ్యవస్థ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తీర్చే విధంగా కృషి చేస్తానని అందుకు అమలాపురం పట్టణ ప్రజల యొక్క సహాయ సహకారాలు కావాలని కాంగ్రెస్ గుర్తు హస్తం గుర్తుపై ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయడానికి అవకాశం కల్పించాలని విలేకరుల సమావేశంలో ఎస్.కె.ఎన్ మణి కోరారు.



0 Comments