అమరావతి:*మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్‌గా బరిలో నిలిచిన వారు వెంటనే తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలను, ఆదేశాలను ధిక్కరించి ప్రవర్తిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
కూటమిలోని భాగస్వామ్య పక్షాలు పరస్పర సమన్వయంతో, అవగాహనతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వల్పకాలిక, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి కూటమి ఐక్యతకు భంగం కలిగించేలా అభ్యర్థులను రంగంలోకి దించవద్దని హితవు పలికారు. కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిన్న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కాగా, నామినేషన్ల ఉపసంహరణకు (విత్‌డ్రా) రాష్ట్ర ఎన్నికల సంఘం రేపటివరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెబెల్స్ బరిలో లేకుండా చూసేందుకు నాయకత్వం తక్షణ చర్

0 Comments