మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి - డాక్టర్ కె. రాంబాబుకు ఘన సత్కారం*


విశాఖపట్నం:*రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ADME) గా పదోన్నతి పొంది, రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) సూపరింటెండెంట్ గా నూతన బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ కె. రాంబాబు గారికి శనివారం ఆంధ్రా మెడికల్ కళాశాల (AMC) జనరల్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహించారు.

AMC లో జరిగిన ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యారాణి గారు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి గారు హాజరై డాక్టర్ రాంబాబు గారిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "అతి తక్కువ వయసులోనే ADME గా పదోన్నతి పొంది, రాజమహేంద్రవరం వంటి పెద్ద ఆసుపత్రికి సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టడం ఎంతో అభినందనీయం. డాక్టర్ రాంబాబు గారి 26 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, అంకితభావం వైద్య విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, వైద్య రంగానికి మరెన్నో సేవలు అందించాలని" ఆకాంక్షించారు.

*డాక్టర్ కె. రాంబాబు గారు మాట్లాడుతూ...*


నాకు ఈ పదోన్నతి రావడం వెనుక నా ఒక్కడి కృషి కాదు, నన్ను తీర్చిదిద్దిన ఆంధ్రా మెడికల్ కళాశాల, నా గురువులు, నా విద్యార్థులు, నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. 26 ఏళ్లుగా ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ గా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులను చూశాను. IDH సూపరింటెండెంట్ గా , విమ్స్ డైరెక్టర్ , రాష్ట్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ గా  జీవన్‌దాన్ రాష్ట్ర ఇన్‌చార్జ్ గా 5 ఏళ్లు పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ప్రతి పదవి నాకు ఒక పాఠం నేర్పింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప అనుభూతి మరొకటి లేదని తెలుసుకున్నాను.


ఇప్పుడు రాజమహేంద్రవరం GGH సూపరింటెండెంట్ గా నాకు మరో పెద్ద బాధ్యత అప్పగించారు. గోదావరి జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే నా ప్రధాన లక్ష్యం. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం, విద్యార్థులకు మెరుగైన విద్య, ఆసుపత్రి అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తాను. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను" అని భావోద్వేగంగా తెలిపారు.

అనంతరం రాష్ట్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ గా, విమ్స్ డైరెక్టర్ గా, జీవన్‌దాన్ రాష్ట్ర ఇన్‌చార్జ్ గా ఆయన అందించిన విశిష్ట సేవలను పలువురు వక్తలు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సత్యప్రసాద్, మాజీ విభాగాధిపతి డాక్టర్ రాధాకృష్ణన్, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్, వైద్యులు, పీజీ విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments