ఆంధ్రవిశ్వవిద్యాలయం, అక్టోబర్ 3 యువత మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. జాతీయ మానసిక వారోత్సవాలను పురస్కరించుకుని తన కార్యాలయంలో ప్రత్యేక పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు- నిర్వహణ అంశంపై విద్యార్థులకు పలు కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అవసరమన్నారు. ఈ దిశగా చొరవ తీసుకున్న అధికారులను, వైద్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.వెంకట సుబ్బయ్య, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ఆచార్య ఎస్.హరనాథ్, అసోసియేట్ డీన్ ఆచార్య మేరీ సౌజన్య, ప్రభుత్వ మానసిక వైద్య శాల వైద్యులు డాక్టర్ ఎన్.హరి కృష్ణ, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ బి.జె.పి మల్లిక, ఏయూ స్టూడెంట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు ఏ.కె.ఎం పవార్, ఆచార్య రేవతి దేవి, ఎన్,ఎస్.ఎస్ సమన్వయకర్త డి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు
0 Comments