Dr Nanduri Ramakrishna Sr Sub EDITOR
విశాఖపట్నం, అక్టోబర్ 3:భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో , విద్యా భారతి - న్యూఢిల్లీ ద్వారా జరుగుతున్న 37వ జాతీయ మల్ఖంబ్ క్రీడలు రెండవ రోజు కూడా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న బాలబాలికలు అద్భుతమైన మల్ఖంబ్ విన్యాసాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి విశాఖ సిటీ కమిషనర్ Dr. Shankhabrata Bagchi, I.P.S. ముఖ్య అతిథిగా హాజరై చిన్నారుల విన్యాసాలను తిలకించి, వారిని ఆశీర్వదించారు. GVMC 43వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పెడ్డిశెట్టి ఉషాశ్రీ కూడా పాల్గొని క్రీడాకారులను అభినందించారు.BVK సెక్రటరీ శ్రీ వి. సత్యనారాయణ గారు, డైరెక్టర్ శ్రీమతి అంజలి ప్రసాద్, వైభవ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ శ్రీ బుద్ధరాజు శివాజీ గారు కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.క్రీడాకారుల ప్రతిభను అతిథులు, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు మరియు ప్రేక్షకులు ప్రత్యేకంగా అభినందించారు. పోటీలు అక్టోబర్ 3 వరకు కొనసాగగా, అక్టోబర్ 4న సమారోపణ కార్యక్రమం ఉంటుందని క్షేత్ర విద్యాభారతి సంయోజకులు KRK సత్యనారాయణ, B శంకర్, k s చక్రవర్తి తెలియచేశారు.

0 Comments