జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఖాదీ సంతను విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం శ్రీభరత్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీతోపాటు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
గాంధీజీ పిలుపు ఇచ్చినటువంటి స్వదేశీ వస్తువుల వినియోగంలో ఖాదీ కి అధిక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు.
ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను, హస్త కళలను ప్రోత్సహించాలని తెలియజేశారు స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారు ఖాదీ వస్త్రాలు ధరించినందుకు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి ఎంబిబిఎస్ చదివిన తర్వాత కూడా సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారని తెలియజేశారు.
అప్పటి రోజుల్లో ఖాదీకి అంత ప్రాముఖ్యత ఉండేదని అన్నారు.ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ గారు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కే సురేంద్రమోహన్,బిజెపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ కే రవిరాజ్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments