విశాఖపట్నం: స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం మరియు గాంధీ జయంతి సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే, విశాఖపట్నం డివిజన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ మరియు రైల్వే కాలనీలలో పలు అవగాహన, పర్యావరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు విశాఖపట్నం డివిజన్ డీఆర్ఎం శ్రీ లలిత్ బోహ్రా నాయకత్వం వహించారు.శ్రీ లలిత్ బోహ్రా, డీఆర్ఎం, ఏడీఆర్ఎంలు, శాఖాధిపతులు మరియు రైల్వే సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్, కాలనీ పరిసరాల్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. సింహగిరి రైల్వే కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం నం. 1పై పరిశుభ్రత, పారిశుధ్యం మరియు పౌర బాధ్యతపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం ముగింపులో రైల్వే స్టేషన్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.SCoRWWO అధ్యక్షురాలు శ్రీమతి జ్యోత్స్నా బోహ్రా, SCoRWWO సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ఈ కార్యక్రమాల ద్వారా ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, కాలనీ నివాసితులు మరియు ప్రజల్లోకి తీసుకెళ్లారు.




0 Comments