స్వచ్ఛతతో సేవా స్ఫూర్తి… సేవతో దివ్యత్వం *"స్వచ్ఛత సే దివ్యతా తక్(స్వచ్ఛత నుండి దైవత్వం వరకు )”లో భాగంగా ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం*


ఉక్కునగరం, అక్టోబర్ 2, 2026:మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశం “Cleanliness is Godliness” స్ఫూర్తితో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు దేశ వ్యాప్తంగా చేపట్టిన “స్వచ్ఛత సే దివ్యతా తక్” కార్యక్రమంలో భాగంగా ఉక్కునగరం సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి మందిరం పరిసరాలతో పాటు సెక్టార్-2 షాపింగ్ కాంప్లెక్స్ పరిసరాల్లో సేవాదళ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడంతో పాటు పరిసరాలను శుభ్రం చేశారు. స్వచ్ఛత, సేవ, సామాజిక బాధ్యతలను సమన్వయం చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

ఈ సేవా కార్యక్రమంలో శ్రీ డి.ఏ.వి. సన్యాసి రాజు, శ్రీ ఎస్.ఎం. విష్ణుమూర్తి, శ్రీ ఎస్.కె.ఆర్.కె. రాజు, శ్రీ కె.వి. రమణ, శ్రీ ఎం. ఆనంద్, శ్రీ వి. కృష్ణ, శ్రీ కె. ప్రకాష్, శ్రీ కె. పద్మరాజు, శ్రీ పి. గోవిందరావు, శ్రీ ఎస్.ఎస్. సాయి గణేష్, శ్రీ ఎం. రామస్వామి, శ్రీ ఎం. దివాకర్, శ్రీ డి. రమణ, శ్రీ ఎం. కోటేశ్వరరావు, చిన్నారులు శ్రీ ఆర్. పురందరేశ్వరరావు, శ్రీ బి.బి. జ్ఞానేశ్వర్, శ్రీ బి. మోహిత్, శ్రీ పి. నవీన్ పాల్గొన్నారు.

అలాగే మహిళా సేవాదళ్ సభ్యులు శ్రీమతి ఎం. రామలక్ష్మి, శ్రీమతి డి. శకుంతల, శ్రీమతి కె. సుజాత, శ్రీమతి ఎస్. దేవి, శ్రీమతి బి. నిర్మల, శ్రీమతి పి. తుషిత, శ్రీమతి కె. సోనాక్షి, శ్రీమతి పి.ఎన్. హిమ సౌజన్య సేవా కార్యక్రమంలో పాల్గొని తమ సేవలను అందించారు.

“పరిసరాల స్వచ్ఛత మన బాధ్యత… స్వచ్ఛతలో సేవ, సేవలో దివ్యత్వం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సేవాదళ్ సభ్యులలో సేవా భావాన్ని మరింతగా పెంపొందించింది.

ఈ పవిత్ర సేవలో పాల్గొన్న ప్రతి సేవాదళ్ సభ్యునికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా లభించాలని సమితి ఆకాంక్షించింది.

“స్వచ్ఛతే సేవ… సేవే సాధన… సాధనే దివ్యత్వానికి మార్గం!”

Post a Comment

0 Comments