ఆంధ్రవిశ్వవిద్యాలయం, అక్టోబర్ 6:విద్యార్థులు తాము చదువుకుంటున్న కోర్సుతో పాటు విభిన్న శాస్త్రీయ అంశాలపై అవగాహన ఉండాలని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న మెష్ మేహం టెక్నికల్ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడుగుతూ వారి నుండి సమాధానాలను తెలుసుకుంటూ ఆసక్తిదాయకంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానన్ని కార్యరూపంలో చూపే సందర్భంలో అనుబంధ శాస్త్రాలకు సంబంధించిన అంశాలను అనుసంధానం చేసుకుంటూ ముందకు సాగాల్సి ఉంటుందన్నారు. దీనికి అనుగుణంగా తమ జ్ఞానాన్ని నిరంతరం మెరుగు పరచుకోవాలని సూచించారు. ఇటువంటి సాంకేతిక సదస్సులు విద్యార్థులకు నూతన జ్ఞానాన్ని, వస్తమాన పరిశోధనలు, ఆవిష్కరణలపై లోతైన అవగాహన కల్పిస్తాయన్నారు. తాము పుస్తకాలలో చదువుకున్న జ్ఞానాన్ని వర్తమాన సమాజంలో ఉపయోగించే విధానం, సమాజ ఉపయుక్తంగా జరిగే పరిశోధనలపై అవగాహన కలుగుతుందన్నారు.
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థులు స్వయంగా ఇటువంటి టెక్నికల్ వర్క్ షాప్‌లను నిర్వహించడం పట్ల విద్యార్థులను అభినందించారు. విభిన్న రంగాలలో నిపుణులను ఆహ్వానిస్తూ వర్తమాన జ్ఞానాన్ని అందించే విధంగా వర్క్ షాప్ రూపకల్పన చేసిన విద్యార్థులను వారికి మార్గనిర్ధేశం చేసిన ఆచార్యులను అభినందించారు.సి.ఏ.డిఎఫ్.ఈ.ఎం గ్రూప్ సీనియర్ అప్లికేషన్ ఇంజనీర్-ఫ్లూయిడ్స్ జె.కార్తీక్ తన ప్రసంగంలో సిమ్యులేషన్ ప్రాధాన్యతను వివరించారు. సిమ్యులేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కంప్యూటేషనల్ సమయాన్న, తయారీ ఖర్చును తగ్గించడమేనన్నారు. 'ఐడియేషన్స ను మెదటి దశగా పరిగణిస్తామన్నారు. ఐడియేషన్ అంటే ఆలోచనలను ప్రతిపాదించడమన్నారు. ఐడియేషన్ దశలో మనకు ఉన్న ఆలోచనలన్నింటినీ సిస్టమ్‌లో ఉంచి సిమ్యులేషన్ చేయవచ్చునని ఉదాహరణలతో వివరించారు. ప్రత్యక్ష ప్రయోగాలు చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని, సిమ్యులేషన్‌తో దీనిని సులభంగా వేగంగా పూర్తిచేయగలమన్నారు.
కార్యక్రమంలో ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు


0 Comments