*జిల్లా టిడిపి కార్యాలయంలో సమావేశమైన కూటమి నేతలు*


జీవీఎంసీకి జరగబోయే ఎన్నికలలో సమన్వయంతో పనిచేయడానికి టిడిపి స్థానిక ఎన్నికల పరిశీలకులు ఎంఏ షరీఫ్  అధ్యక్షతన బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు సమావేశం అయ్యారు ఈ సందర్భంగా మనమందరం సమిష్టిగా పనిచేసి అత్యధిక స్థానాలు గెలుపొందించడానికి కృషి చేద్దామని నిర్ణయించుకున్నారు. జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ శాసనసభ్యులు లేని నియోజకవర్గాలలో  సమన్వయకర్తలను కలుపుకుని వెళ్లాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గణబాబు,పి విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్ బాబు, శాసనమండలి  సభ్యులు ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి, పెందుర్తి ఇంచార్జ్ గండి బాబ్జి, దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ సీతం రాజు సుధాకర్, పీలా గోవింద సత్యనారాయణ, ఉడా చైర్మన్ ఎం.వి ప్రణవ్ గోపాల్, బిజెపి అధ్యక్షులు పరశురామరాజు , విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ, 

తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments