సింహాచలం:14 అక్టోబర్ 2026.అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి టి. నిశాంతి, ఐఏఎస్ ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో వెలసియున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్‌కు దేవస్థానం సహాయ కార్యనిర్వాహణాధికారి పిల్లా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ ఆచార సంప్రదాయాల ప్రకారం, కలెక్టర్ ముందుగా మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు
దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు కలెక్టర్‌కు శేషవస్త్రం సమర్పించి సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.


0 Comments