”శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛతా సే దివ్యతా తక్ – స్వచ్ఛత నుంచి దివ్యత్వం వరకు” సేవా కార్యక్రమంలో భాగంగా, *సిటీ సేవా సమితికి చెందిన ఎండాడ శ్రీ సత్యసాయి భజన మండలి సభ్యులు* భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవమైన అక్టోబర్ 20 వరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత, క్రమశిక్షణ, సేవాభావం మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని సమాజంలో పెంపొందించడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కృషి చేస్తున్నాయి.ఈ కార్యక్రమంలో భాగంగా ఎండాడ శ్రీ సత్యసాయి భజన మండలి సభ్యులు ఎండాడ మందిరం మరియు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతా సేవ నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో కన్వీనర్ శ్రీ రామకృష్ణ గారితో పాటు మొత్తం 16 మంది సభ్యులు – 9 మంది పురుషులు, 7 మంది మహిళలు పాటు సేవలో పాల్గొని మందిర పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.శుభ్రమైన పరిసరాలు – పరిశుద్ధమైన మనసు – దివ్యమైన జీవనం” అనే సందేశాన్ని చాటుతూ నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం, స్వచ్ఛత అనేది కేవలం పరిసరాలను శుభ్రపరచడం మాత్రమే కాకుండా, సేవాభావం ద్వారా మనలోని పరిశుద్ధతను మేల్కొలిపే ఒక ఆధ్యాత్మిక సాధన అనే భావనను ప్రతిబింబించింది.స్వచ్ఛతను సేవగా, సేవను సాధనగా, సాధనను దివ్యత్వానికి మార్గంగా భావిస్తూ ఎండాడ శ్రీ సత్యసాయి భజన మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
“స్వచ్ఛత నుంచి దివ్యత్వం వరకు… ప్రతి అడుగు సేవ వైపు, ప్రతి సేవ దివ్యత్వం వైపు.”





0 Comments