శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. గోశాల కాలనీలో నిర్మిస్తున్న గృహాల పనులను పరిశీలించిన ఈఓ జల్లేపల్లి వెంకట్రావు.

 


సింహాచలం, అక్టోబర్ 4, 2026: సింహాచలం దేవస్థానం పరిధిలోని గోశాల కాలనీలో షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) వర్గాల కోసం నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులను ఆలయ కార్య నిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆదివారం సాయంత్రం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈఓ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, ఎలక్ట్రికల్ డీఈ సుంకర తాతాజీ, బంగారు రాజు, ఏఈ బాబ్జి తదితర ఇంజనీరింగ్ అధికారులు గృహ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు

నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఈఓ,గృహాలకు అవసరమైన విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ, రహదారి తదితర మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

అనంతరం ప్రసాదం పథకం ద్వారా నిర్మించిన పుష్కరిణి సత్రం వద్ద ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఈఓ పరిశీలించారు. అక్కడ డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా, శాశ్వత ప్రాతిపదికన నిర్మించి, వర్షపు నీరు మరియు మురుగునీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

దేవస్థానం పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత, భక్తులు మరియు ప్రజలకు సౌకర్యం, దీర్ఘకాలిక ప్రయోజనం ప్రధానంగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈఓ జల్లేపల్లి వెంకట్రావు సూచించారు.

Post a Comment

0 Comments