శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులకు సింహాచలంలో స్వాగతం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు.

 


సింహాచలం, అక్టోబర్ 4, 2026:ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు ఆదివారం సింహాచల శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షణ అధికారి రామ జోగారావు, పి ఆర్ ఓ నాయుడు,ఎమ్మెల్యే దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 

అనంతరం స్వామివారి ఆలయ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన కప్పస్తంభం ఆలింగనం కార్యక్రమాన్ని నిర్వహించి, అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు 

ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వారికి వేద ఆశీర్వచనం అందించారు.

ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు సింహాచల క్షేత్ర మహిమను, ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రశంసించారు.

Post a Comment

0 Comments