విశాఖపట్నం, అక్టోబర్ 17: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి తమ బాధ్యతలపై పూర్తి అవగాహన ఉండాలని జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ ఆదేశించారు. శనివారం ఆయన గాజువాక లోని బి హెచ్ ఈ ఎల్ సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పిఓ , ఏపీవో ల శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి అందిస్తున్న శిక్షణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులకు నియమితులైన పిఓ లు, ఏపీవోలు తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని, ఎన్నికల నియమావళి, విధివిధానాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. విధుల నిర్వహణలో రాజకీయాలకతీతంగా ఉండడంతోపాటు సమయపాలన, క్రమశిక్షణ, ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు.అనంతరం స్ట్రాంగ్ రూమ్‌ను, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కమిషనర్ పరిశీలించి, అక్కడ చేపట్టిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రి భద్రత, కేంద్రాల నిర్వహణ, అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ కె. రమేష్, జోనల్ కమిషనర్ శేషాద్రి, రిటర్నింగ్ అధికారి మధులత, ఏసీపీ వెంకట్రావు, పర్యవేక్షక ఇంజనీర్ రాయల్ బాబు, ఏ ఎం ఓ హెచ్ కిరణ్, ఏపీడీ తదితర అధికారులు పాల్గొన్నారు.
మీడియా సెంటర్జీవీఎంసీ ఎలక్షన్స్ 2026




0 Comments