విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తల సమావేశం


విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని: త్వరలో  రానున్న స్థానిక సంస్థల (జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం, ప్రచార వ్యూహాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తలు సంకు వెంకటేశ్వర రావు,పీ ఉషా కిరణ్,పెద్దిరెడ్డి ఉష శ్రీ తెలిపారు. అతి త్వరలో జీవీఎంసీ ఎన్నికల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో సోమవారం పీ ఉషా కిరణ్ కార్యాలయంలో సంకు వెంకటేశ్వర రావు,పీ ఉషా కిరణ్,పెద్దిశెట్టి ఉష శ్రీ సమావేశమై రాబోయే జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై, కూటమి పొత్తుల నేపథ్యంలో వార్డుల వారీగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం,క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడంపై చర్చించారు.అనంతరం సంకు వెంకటేశ్వ రావు మాట్లాడుతూ  ఉత్తర నియోజకవర్గ పరిధిలోని వార్డులలో సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి,రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన-కూటమి అభ్యర్థుల విజయానికి  కూటమి తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.ఉత్తర నియోజకవర్గ పరిధిలోని అత్యధిక వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Post a Comment

0 Comments