ఆంధ్రవిశ్వవిద్యాలయం, అక్టోబర్ 2:ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్, పాలక మండలి సభ్యులు, ప్రిన్సిపాల్స్, అధికారులతో కలిసి పలు నూతన ప్రాజెక్టుల నిర్మాణాలను లాంఛనంగా ప్రారంభించారు. నూతనంగా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టులలో భాగంగా రూ 3.86 కోట్లతో క్యాంపస్‌లో గేట్లు, లాండ్‌స్కేపింగ్, రూ 1.25కోట్లతో స్నాతకోత్సవ మందిరం రినోవేషన్, రూ 4.67 నార్త్, సౌత్ క్యాంపస్‌లలో బి.టి రోడ్లు నిర్మాణం, రూ 4 కోట్లతో అండ్ గ్రౌండ్ కేబిలింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు,రూ 2.75 కోట్లతో వైస్ చాన్స్‌లర్ బంగళాతో పాటు విద్యార్థులకు ఉపయుక్తంగా నిలచే పలు భారీ మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు.
శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నూతన ప్రాజెక్టులను చేపడుతున్నారు. శతాబ్ధి ఉత్సవాల ముగింపు సమయంలో భారత ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య శాఖ మంత్రి నారా లోకేష్‌ల సమక్షంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. టెండరింగ్ ప్రక్రియ పూర్తిచేసి పనులను ప్రారంభించారు. టెండరింగ్ ప్రక్రియలో భాగంగా ఉన్నవి త్వరలోనే ప్రారంభించనున్నారు.
కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, పాలక మండలి సభ్యులు ఆచార్య ఆర్.పద్మశ్రీ, ఆచార్య ఎన్.చిట్టిబాబు, చీమలపాటి సూర్యనాయాయణ శేఖర్, ఆచార్య వి.ఎస్.ఆర్.కె ప్రసాద్, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ డీన్ ఆచార్య కె.శ్రీనివాస రావు, యూనివర్సిటీ ఇంజనీర్ వి.తిరుపతి రావు, ప్రిన్సిపాల్స్, డీన్‌లు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

0 Comments