మ‌హాత్ముని ఆశ‌యాల‌ను సాకారం చేద్దాం

 


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం:స‌త్యం, అహింస‌ సిద్దాంతాల‌తో దేశానికి స్వాతంత్య్రం స‌ముపార్జించిన మ‌హాత్మ గాంధీ ఆశ‌యాల‌ను సాకారం చేసే దిశ‌గా అంద‌రూ కృషి చేయాల‌ని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ పిలుపునిచ్చారు. శుక్ర‌వారం ఉద‌యం ఏయూ ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద‌నున్న మ‌హాత్ముని విగ్ర‌హానికి ఆయ‌న పుష్పాంజ‌లి ఘ‌టించారు. స‌క‌ల్పం, స‌మైక్య‌త బ‌లాన్ని ఆయ‌న ప్ర‌పంచానికి చాటార‌న్నారు. దేశ‌భ‌క్తిని ప్ర‌తీ ఒక్క‌రిలో నింపుతూ స్వాతంత్య్ర పోరాటాన్ని న‌డిపిన విధానం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఆయ‌న కార్య‌ద‌ర‌క్ష‌త‌, స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు సాగాల‌న్నారు.

కార్య‌క్ర‌మంలో రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్‌, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, పాల‌క మండ‌లి స‌భ్యులు, ప్రిన్సిపాల్స్‌, డీన్‌లు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments