విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రియాంక దండి కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా అవకాశం కలిపించమని పార్టీ నాయకత్వానికి దరఖాస్తు సమర్పించారు, నన్ను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేస్తే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖకు చేసిన అభివృద్ధిని వివరించి, మోదీతో జత కట్టిన పార్టీలకు బుద్ది చెప్పి ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టేలా కృషి చేస్తానని, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి మేనిఫెస్టో ద్వారా ప్రజల ముందు ఉంచుతానని ప్రియాంక తెలిపారు. ఆమెతో పాటు తూర్పు నియోజకవర్గం నుండి ఈగల మోహన్ సాయి, పర్వీన్ ఖాన్, చింతపల్లి వెంకటేష్, గుర్రం కనకరావు,ఓలిశెట్టి స్వప్న, ఎం అరుణ కుమారి, ఇసంపల్లి రఘురాజా కార్పొరేటర్ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
0 Comments