జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,


ఈరోజు అనగా తేది. 16.10.2026 న  విశాఖపట్నం ప్రభుత్వ చాతీ మరియు అంటువ్యాదుల ఆసుపత్రి (టి.బి.హాస్పిటల్) లో సంజీవని ఛాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ


 ఈ సంజీవని ప్రోగ్రాం ప్రధాన లక్ష్యం వ్యాధుల బారిన పడకుండా ముందస్తు నివారణ, ఉచిత వైద్య పరీక్షలు, ప్రతీ పౌరునికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియెట్ చేసి ఇంటి వద్దనే వైద్యం అందించే విధంగా ప్రణాళిక అని డిసెంబర్ 10 వ తేది నుండి అన్ని పట్టణ/ప్రాధమిక ఆరోగ్య కేంద్రముల నుండి ఈ సంజీవని సేవలు అందుబాటులోకి వస్తుందని తెలియచేసారు.      


ఈ సమావేశం లో టాటా గ్రూప్ ఎం.డి. డా.శ్రీకాంత్ వారు మరియు వారి టీం, స్టేట్ నోడల్ అధికారి శ్రీమతి సృజన వారు విశాఖపట్నం జిల్లా నోడల్ అధికారి డా.బి.ఉమావతి మరియు వారి బృందం మరియు విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం మరియు పార్వతీపురం జిల్లాల నుండి డి.ఎం.హెచ్.ఒ.లు, డి.పి.ఎం.ఒ.లు, జిల్లా ప్రోగ్రాం అధికారులు,అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ.బి.నాగభూషణం వారు మరియు కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు

 జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

                        విశాఖపట్నం

Post a Comment

0 Comments