తూర్పు నియోజకవర్గ వెలుగుల పూడి మన వెలగపూడి.

 వెలగపూడి రామకృష్ణ బాబు మన తూర్పు నియోజకవర్గ వెలుగుల పూడి ఆనక మానరు 

ఇచట ప్రజానీకం.

అనితర సాధ్యుడు,

గుండ్రటి సుందర 

వద నుడు, సువిశాల 

హృదయుడు.

ఎల్లెడల అందరికీ 

అందుబాటులో 

ఉండే ఏకైక 

శాసన సభ్యులు.

వారి కార్యాలయం 

అన్ని వేళలా 

నియోజక వర్గ 

నివాసితులతో,

పార్టీ కార్య కర్తలతో 

కిట కిట లాడుతూ 

కడు శోభాయ 

మానం గా 

ఉంటుంది.

వారి గురించి 

మనం ఎదురు 

చూడనవసరం 

లేదు, అందరికీ 

సేవ లందించడానికి 

సదా సిద్ధం 

ఉంటారు వారు.

వారి సిబ్బంది కూడా 

కార్యాలయానికి 

విచ్చేసిన అందరినీ 

సాదరంగా ఆహ్వానం 

పలకడం వారికే 

చెల్లింది.

నేడు ఫుల్ టైమ్ 

శాసన సభ్యుడు 

ఎవరు అంటే 

టక్కున జ్ఞప్తికి 

వచ్చేది మన 

గౌరవ CBN గారితో 

సహా మన వెలగపూడే 

కదా!  అందుకే 

ఏనాడూ వారు 

ఓటమి చవి 

చూడ లేదు.

ఎవరినీ నొప్పించరు,

విమర్శించరు,

తనను విమర్శించే 

అవకాశం కూడా 

ఎవరికీ ఇవ్వరు.

అదే వారి నిజాయితీ,

నిబద్ధత.

ఆయన రాజకీయ నాయకుడు కాదు,

సమాజ సేవకుడు,

వారి నిండైన మోముకి 

మీసం ఓ ఆభరణం.

నిరాశ, నిస్పృహ 

వారిలో కానరావు.

వారి ఆత్మీయ 

పలకరింపుతో

పులకించని 

వారెవ్వరు.

వారి కార్యాలయానికి

విచ్చేసిన అందరికీ 

చక్కని, చిక్కటి 

టీ ఇచ్చి సేద 

తీరుస్తారు. 

విచ్చేసిన 

ఎవరి నుంచి 

వారు కాని,

వారి సిబ్బంది 

కానీ ఏది ఆశించరు.

వారు ఎవరినీ 

శాసించరు,

శాసన సభ్యునిగా!

అదీ వారి ప్రత్యేకత.

ప్రజా ప్రతినిధులకు

వారు ఆదర్శ 

ప్రాయులు.

యావత్ శాసన 

సభ్యులు అందరికీ 

స్ఫూర్తి ప్రదాత.

ప్రజా ప్రతినిధి 

అంటే నిలువెత్తు 

నిదర్శనం మన 

వెలగపూడి.

అంతే కాదు 

ప్రభుత్వ అధికారులతో 

నియోజక వర్గ 

అభివృద్ధి కోసం 

అహర్నిశలు 

ఆలోచనాత్మకంగా

పని చేయించుకునే

సమర్థ శాసన 

సభ్యులు వారు,

అందుకే జయం 

వారిని వెంటాడుతూ 

ఉంటుంది, సదా.

మన శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న బాలాంజనేయ స్వామి 

 వారి అనుగ్రహం 

తో వారికి మనో వాంఛ 

ఫల సిద్ధి రస్తు అని 

కోరుకుందాం.

వారి శ్రేయస్సు సదా 

కోరుకునే                                  


                    డా: నండూరి రామకృష్ణ

                     సీనియర్ సబ్ ఎడిటర్


Post a Comment

0 Comments