నోటి క్యాన్సర్ పేషంటు పోలి పిల్లి . బంగారమ్మ, కు శ్రీ వాత్సవ్ ఆర్థిక సహాయం.....


విశాఖపట్నం- విశాఖ సందేశం వార్తా వాహిని- వివేకానంద సంస్థ సభ్యులు వెంకట్ గారి భార్య శ్రీమతి. పోలి పిల్లి. బంగారమ్మ నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కారణంగా యువజన నాయకులు ద్రోణం రాజు. శ్రీ వాత్సవ గారు బంగారమ్మకు  5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. వివేకానంద సంస్థ వారు ఆమె కుటుంబ సభ్యులకు ఒక బియ్యం బస్తాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ వాత్సవ మాట్లాడుతూ, సంస్థ సభ్యులు గాని, మరి ఎవరైనా గాని రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి వివేకానంద సంస్థ వారు ఆర్థికంగా సహాయం అందిస్తూ, వారి కుటుంబాలను ఎంతగానో ఆదుకుంటున్నారు, ఈ సందర్భంగా సంస్థవారిని కొనియాడారు,

 ఈ నేపథ్యంలోనే సంస్థ ద్వారా నేను కూడా ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. వివేకానంద సంస్థ వారు కాశీ వెళ్లి వచ్చిన సందర్భంగా అన్నదానం నిర్వహించారు,  ఈ అన్నదాన కార్యక్రమంలో శ్రీ వాత్సవ్ పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సేవకులుT. కృష్ణ, రమణ, రాంబాబు, కోదండ, సంస్థ సభ్యులు అప్పలకొండ, సత్తిబాబు మొదలైన వారు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments