సింహాచలం, సెప్టెంబర్ 21, 2026:సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ దంపతులు సోమవారం దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు ఆలయ పర్యవేక్షణ అధికారి జి.వి.ఎస్.కె. ప్రసాద్ సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయ సంప్రదాయాలను అనుసరించి ముందుగా మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కరకదేవుడు తదితరులు పాల్గొన్నారు


0 Comments