విశాఖపట్నం వి:శాఖ సందేశం వార్తా వాహిని: ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదలైన ప్రస్థానం.25 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన మార్పులకు నాంది.
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం, దేశ కీర్తి ప్రపంచవ్యాప్తంగా మరింతగా పెరగడం ఎంతో గర్వకారణం
మూడు దశాబ్దాలకు పైగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కలగా ఉన్న విశాఖ రైల్వే జోన్.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌గా విశాఖ కేంద్రంగా రావడం చాలా సంతోషకరమైన విషయంఒకప్పుడు అసాధ్యమని భావించిన రైల్వే జోన్‌ను సాకారం చేయడం నరేంద్ర మోదీ నాయకత్వానికి నిదర్శనం దీని ద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర, మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు మరింత పెరగనున్నాయి త్వరలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంతో పాటు క్వార్టర్స్, రైల్వే క్లబ్ వంటి నిర్మాణాలు కూడా అందుబాటులోకి రానున్నాయి
నరేంద్ర మోదీ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరింతకాలం దేశానికి సేవ చేసే అవకాశం కలగాలని కోరుకుంటున్నాం
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఎం. నాగేంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి సుహాసిని ఆనంద్, స్టేట్ మీడియా ప్యానలిస్ట్ కే నర్సింగరావు, పార్వతీపురం జిల్లా ఇంచార్జ్ పి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గం ఇన్చార్జి కొమర రవిరాజ్, జిల్లా మీడియా కన్వీనర్ టీ కోటేశ్వరరావు, మండల అధ్యక్షుడు కే సతీష్ బాబు కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments