విశాఖపట్నం, అక్టోబర్ 7:విశాఖపట్నంలోని రైల్వే ఇండోర్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్ (RISE)లో 80వ పురుషుల, 19వ మహిళల ఆల్ ఇండియా రైల్వే బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ – 2026 ఈరోజు ఘనంగా ప్రారంభమైంది.
సౌత్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్, విశాఖపట్నం డివిజన్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్, SCoRSA అధ్యక్షులు శ్రీ లలిత్ బొహ్రా ముఖ్య అతిథిగా పాల్గొనగా, SCoRWWO, విశాఖపట్నం అధ్యక్షురాలు శ్రీమతి జ్యోత్స్నా బొహ్రా గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ రైల్వే అధికారులు శ్రీ ఈ. శాంతారం, ADRM (ఇన్‌ఫ్రా), శ్రీ కె. రామారావు, ADRM (ఆపరేషన్స్), శ్రీ కె. పవన్ కుమార్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (Sr. DCM), శ్రీ ఎం. హరనాధ్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ (Sr. DFM) హాజరై, ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.అక్టోబర్ 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో దేశవ్యాప్తంగా వివిధ రైల్వే యూనిట్లకు చెందిన ప్రతిభావంతులైన పురుషులు, మహిళా బాక్సర్లు పాల్గొంటున్నారు. రైల్వే క్రీడాకారులు తమ బాక్సింగ్ ప్రతిభ, పోటీతత్వ స్ఫూర్తి, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ పోటీలు ప్రతిష్టాత్మక వేదికగా నిలుస్తున్నాయి.
ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖులు క్రీడాకారులకు విజయాన్ని ఆకాంక్షిస్తూ, రైల్వే ఉద్యోగుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, ప్రతిభను పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ ఛాంపియన్‌షిప్‌ను సౌత్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్, విశాఖపట్నం డివిజన్ నిర్వహిస్తోంది.



0 Comments