రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే గిరిజన హక్కులకు పటిష్ట రక్షణ* *గిరిజన చట్టాల అమలు, సామాజిక న్యాయం, యువతకు ఉద్యోగ అవకాశాల కోసం కాంగ్రెస్‌తో కలిసి పోరాడాలి* *గుంటూరులో IYC బునియాది శిక్షణ శిబిరంలో పాల్గొన్న అల్లూరి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రతినిధి అడ్డకట్ల పవన్ కుమార్


డుంబ్రిగూడ మండలం, అక్టోబర్7,2026:ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) – ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో **అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో గుంటూరులో నిర్వహించిన “IYC Buniyaadi Training Camp” (ఐవైసీ బునియాది శిక్షణ శిబిరం)**లో అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి పంచాయతీ శరత్‌నగర్ గ్రామానికి చెందిన అడ్డకట్ల పవన్ కుమార్ అల్లూరి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమంలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, యువత రాజకీయ భాగస్వామ్యం, ప్రజా సమస్యలపై పోరాటం, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవలో యువత పాత్ర తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా అడ్డకట్ల పవన్ కుమార్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి యువత చేతుల్లోనే ఉందని, గ్రామస్థాయి నుంచే యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

“గౌరవ రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే గిరిజనులు, దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం మరింత బలోపేతం అవుతుందని మా విశ్వాసం. గిరిజనుల రాజ్యాంగబద్ధమైన హక్కులు, రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు కావడంతో పాటు యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, సమాన న్యాయం అందేలా కృషి చేయాలి” అని పవన్ కుమార్ అన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి గిరిజన ప్రాంతాల్లో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, పీసా చట్టం, గిరిజన హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, అటవీ హక్కులు వంటి అంశాలపై యువతకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి తీసుకురావడంలో యువత ముందుండాలని సూచించారు. యువత రాజకీయాలను కేవలం పదవుల కోసం కాకుండా ప్రజాసేవకు ఒక వేదికగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

గ్రామస్థాయి నుంచే యువ నాయకత్వం బలోపేతం కావాలి ప్రతి గ్రామంలో ఉన్న యువతకు రాజకీయాలు, రాజ్యాంగం, ప్రజా హక్కులపై అవగాహన కల్పించి గ్రామస్థాయి నుంచి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కొత్త యువ నాయకత్వాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కుమార్ తెలిపారు.

“IYC బునియాది శిక్షణ శిబిరంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మూడు రోజుల శిక్షణ ద్వారా నాయకత్వ లక్షణాలు, ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత, రాజ్యాంగ విలువల పరిరక్షణ, యువత రాజకీయ పాత్రపై మరింత అవగాహన వచ్చింది. ఈ శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని అల్లూరి జిల్లా యువతతో పంచుకుని, గ్రామస్థాయి నుంచి యువతను చైతన్యపరిచేందుకు కృషి చేస్తాను” అని ఆయన తెలిపారు.

ఈ శిక్షణ శిబిరంలో “Five Rights – One Panja – One Young India” అనే దృక్పథంతో విద్య, అవకాశాలు, న్యాయం, జవాబుదారీతనం, స్వేచ్ఛ వంటి అంశాలను యువతలోకి తీసుకెళ్లే విధంగా శిక్షణ అందించినట్లు పవన్ కుమార్ పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన యువత తమ హక్కుల కోసం, తమ ప్రాంత అభివృద్ధి కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు రావాలని, ప్రజాసేవలో యువత మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

            అడ్డకట్ల పవన్ కుమార్

           యూత్ కాంగ్రెస్ ప్రతినిధి

        అల్లూరి సీతారామరాజు జిల్లా

Post a Comment

0 Comments