విశాఖపట్నం: మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి, వారు స్వయంగా ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబులుగా ఎదగడానికి సహాయపడే ఉద్దేశంతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) సహకారంతో ఉచిత బాలల సంరక్షణ సహాయకుల శిక్షణ కార్యక్రమంను నిర్వహిస్తోంది.
ఈ శిక్షణా కార్యక్రమం 2026 నవంబర్ 2వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి మహిళా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఎండాడ, విశాఖపట్నంలో ప్రారంభం కానుంది.
*19 నుంచి 40 సంవత్సరాల మహిళలకు అవకాశం*
ఈ కోర్సులో 19 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళలు చేరవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణత లేదా అనుత్తీర్ణత ఉన్నవారు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
*మొత్తం 360 గంటల పాటు అందించే ఈ శిక్షణలో 2 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల సంరక్షణకు సంబంధించిన నైపుణ్యాలను మహిళలకు అందించనున్నారు*.
శిక్షణ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ధ్రువపత్రం/సర్టిఫికెట్ అందజేయబడుతుంది. భవిష్యత్తులో ఉపాధి, జీవనోపాధి అవకాశాలను పొందడంలో ఈ సర్టిఫికెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
పిల్లల సంరక్షణలో శిక్షణ పొందిన మహిళలు బేబీ కేర్ సెంటర్లు, ఆసుపత్రులు, కిండర్ గార్టెన్లు, ఇంటి వద్ద పిల్లల సంరక్షణ సేవలు వంటి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలను పొందేందుకు ఈ శిక్షణ దోహదపడుతుంది. తద్వారా నిరుద్యోగ మహిళలు లేదా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న మహిళలు ఒక ఉపయోగకరమైన నైపుణ్యాన్ని అభ్యసించి, స్వయంగా ఉపాధి పొందుతూ తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది.
*పూర్తిగా ఉచితంగా శిక్షణ*
ఈ కోర్సు పూర్తిగా ఉచితం. ఎటువంటి రుసుము వసూలు చేయకుండా, సేవా దృక్పథంతో, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మరియు APSSDC ఆధ్వర్యంలో ఈ శిక్షణ అందించబడుతోంది.
*ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖుల హాజరు*
2026 నవంబర్ 2వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి శ్రీ సత్యసాయి మహిళా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఎండాడ, విశాఖపట్నంలో జరగనున్న కార్యక్రమానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిని స్మరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి శ్రీ ఆర్. లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు.
అలాగే శ్రీ K. దినేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్; శ్రీ N. గోవిందరావు, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్; Dr. ఎం. మాధవి, ఎం.డి. (Fellowship in Geriatric); Dr. రజనీ ముఖర్జీ, ఎం.డి. (Paediatrician) తదితరులు ప్రత్యేక అతిథులుగా పాల్గొననున్నారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థల SDP(skill development wing) విభాగం – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడుతోంది.
శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, విశాఖపట్నం, కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం వహిస్తున్నారు.
*అర్హులైన మహిళలకు విజ్ఞప్తి*
ఈ కోర్సుపై ఆసక్తి ఉన్న 19 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళలు, ముఖ్యంగా ప్రస్తుతం ఇంటి పనులు చేస్తూ ఉన్నవారు, నిరుద్యోగ మహిళలు మరియు నైపుణ్యాన్ని అభ్యసించి ఉపాధి పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
అర్హులైన మహిళలకు ఈ సమాచారం చేరేలా ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ఉన్న మహిళలకు, ముఖ్యంగా ఇంటి పనులు చేస్తున్న వారికి ఈ అవకాశాన్ని తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
“Learn • Transform • Serve” అనే స్ఫూర్తితో, ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా మహిళలు తమ జీవితాలను మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.
మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లలో సంప్రదించవచ్చును:
98498 22666
73964 28498
95533 38527

0 Comments