*5 న వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు* *వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం, వస్త్రదానం విస్తృత సేవా కార్యక్రమాలు* *ఎన్నికల అనంతరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయి సమావేశం* *జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు


అక్కయ్యపాలెం జంక్షన్ నవంబర్ 2ఆంధ్రప్రదేశ్  వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అన్నదానం, వస్త్రదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. నవంబర్ 5న వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

సోమవారం అక్కయ్యపాలెం జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి మూడు ముఖ్యమైన తీర్మానాలు చేయడం జరిగిందని గంట్ల శ్రీనుబాబు తెలిపారు.

జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల నియామక ప్రక్రియకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఫెడరేషన్ ఉపాధ్యక్షులు టి. కృష్ణమూర్తిని ఏకగ్రీవంగా నియమిస్తూ తీర్మానించారన్నారు..

*జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక సమావేశం*

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలు.. పెన్షన్ తదితర హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత తదితర అంశాలపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మరోసారి చర్చించేందుకు నిర్ణయించడం జరిగిందని గంట్ల శ్రీనుబాబు తెలిపారు..జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాలని సమావేశం అభిప్రాయ పడిందన్నారు..

ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడంతో పాటు జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించా మన్నారు...

ఈ సమావేశం లో ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ..ఆర్గనైజింగ్ సెక్రటరీ డి. రవి కుమార్,, ఉపాధ్యక్షులు బి శివప్రసాద్ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు కార్యదర్శి కె 

మదన్ స్మాల్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు కోశాధికారి కె.వి శర్మ దేవత్రినాధ్ బి గణేష్ రెడ్డి, వి. గణేష్ జి జగన్ ఏపీడబ్ల్యుజెఎఫ్ ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు జాయింట్ సెక్రెటరీలు వై రాజశేఖర్,చైతన్యభూమి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments