విశాఖపట్నం: జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ ‘సేవ్ వైజాగ్’ నినాదంతో ప్రజల ముందుకు వచ్చిందని, అయితే ఆ పార్టీ వాస్తవ పరిస్థితిని చూస్తే ‘సేవ్ వైసీపీ’ అనే నినాదం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ‘సేవ్ వైజాగ్’ కంటే ‘సేవ్ వైసీపీ’ అనే నినాదమే ఆ పార్టీకి ఇప్పుడు అవసరమని ఎద్దేవా చేశారు.
ప్రజలు మరోసారి కూటమిపై విశ్వాసం ఉంచి పట్టం కట్టారని, అభివృద్ధికి తమ ఓటు ద్వారా మద్దతు తెలిపారని పేర్కొన్నారు. వైసీపీ చేసిన దుష్ప్రచారాలను ప్రజలు విశ్వసించకుండా, విశాఖపట్నం భవిష్యత్తు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమికి మద్దతుగా నిలిచారని తెలిపారు.ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ప్రతిబింబమని, ఇదే స్ఫూర్తితో విశాఖ అభివృద్ధికి మరింత కృషి చేస్తూ ముందుకు సాగుతామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్పష్టం చేశారు.


0 Comments