. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....అల్లవరం మండలంలో ప్రజా సేవకు అంకితమైన రాజకీయ కుటుంబం అయిన గుబ్బల మాస్టారు తనయుడు గుబ్బల రామ్ ప్రసాద్ అల్లవరం మండలం జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా అమలాపురం జడ్పీ కార్యాలయం నందు అట్టహాసంగా నామినేషన్ దాఖాలు చేయడం జరిగింది. ముందుగా అల్లవరం మండలం రామ్ ప్రసాద్ స్వగృహం నుండి భారీ సంఖ్యలో చేరుకున్న నాయకులు, కార్యకర్తలు, మద్దత్తుదారులతో భారీ ర్యాలీ అమలాపురం జడ్పీ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా గుబ్బల రాంప్రసాద్ మాట్లాడుతూ కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి వస్తే జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ మండల అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబు రాజు లు సహకరించాలని కోరారు.కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ,అల్లవరం మండల సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజల మద్దతుతో ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి పొత్తులో భాగంగా నాయకులు ఎవరికీ జడ్పీటీసీ స్థానం కేటాయించిన పొత్తు ధర్మానికి కట్టుబడి ఉంటానని రాంప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు,ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.



0 Comments