జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,


విశాఖపట్నం :ఈరోజు అనగా తేది. 02.11.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు విశాఖపట్నం జిల్లాలో 60 రోజుల పాటు “టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్–4.0” నిర్వహణ ప్రారంభించారు. డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (NTCP) లో భాగంగా, యువతలో పొగాకు వినియోగాన్ని నివారించడం, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం మరియు పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలియచేసారు.

ఈ సందర్భంగా DM&HO కార్యాలయం నుండి సత్యం జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రజలకు పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం మరియు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా DM&HO డాక్టర్ పి. జగదీశ్వరరావు గారు మాట్లాడుతూ, యువత పొగాకు అలవాట్లకు దూరంగా ఉండాలని, విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. పొగాకు వినియోగాన్ని ప్రారంభించకుండా యువతను ప్రోత్సహించడం, ఇప్పటికే పొగాకు వినియోగిస్తున్న వారికి మానివేయడానికి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఈ ప్రచార కార్యక్రమం 28 అక్టోబర్ 2026 నుండి 60 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక యువజన అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రతిజ్ఞలు, IEC కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అలాగే విద్యాశాఖ, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మరియు ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో పొగాకు నియంత్రణ చట్టాల అమలును పటిష్టం చేయడం, పొగాకు రహిత విద్యాసంస్థలు మరియు గ్రామాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుంది.

“పొగాకు వద్దు – ఆరోగ్యమే ముద్దు. యువతే దేశ భవిష్యత్తు – పొగాకు రహిత సమాజమే మన లక్ష్యం.”

ఈ కార్యక్రమంలో PO – NCD & RBSK డాక్టర్ హారిక గారు, ఇతర ప్రోగ్రామ్ అధికారులు, నర్సింగ్ విద్యార్థులు, ANMలు మరియు NCD సిబ్బంది పాల్గొన్నారు.

           జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

            విశాఖపట్నం

Post a Comment

0 Comments