విశాఖపట్నం 30-10-2026 :విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 54వ వార్డు కూటమి అభ్యర్థిగా పోటీపడుతున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు పరశురామరాజుకి మద్దతుగా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 54 డివిజన్లో గల ఏఎస్ఆర్ నగర్,బిలాల్ కాలనీ, మారుతి నగర్, గణేష్ నగర్, సత్యసాయి నగర్,వరాహగిరి కాలనీ మరియు నరసింహ నగర్ ప్రాంతాల్లో పర్యటించి మన మన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.... దేశంలో,రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ ఉందని,దానికి కొనసాగింపుగా పరశురామరాజుకి మద్దతుగా ఓట్లు వేస్తే త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుందని అన్నారు.ఈ సందర్భంగా కాలనీలో గల పలు సమస్యలపై స్పందించారు.త్వరలోనే పంచ గ్రామాల సమస్య కొలికి వస్తుందని, వాటితోపాటు వెళ్ళగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కూటమి ప్రభుత్వం మాత్రమే చూపిస్తుందని, అందులో భాగంగా మీరు కట్టుకున్న ఇళ్ళకి భద్రతా భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం త్వరలోనే పట్టాలి ఇప్పించే విధంగా ప్రయత్నం చేయడంతో పాటు త్రాగునీరు డ్రైనేజ్ రోడ్లు మౌలిక వసతులు సామాజిక భవనాలు నిర్మిస్తామని తెలియజేశారు.ప్రభుత్వపరంగా వారికి రావాల్సినటువంటి పథకాలు తోపాటు వాళ్ల నివాసాలపై ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడితే తనకే స్వయంగా తెలియజేసే విధంగా కేంద్ర మంత్రివర్యులు శరవాణి నెంబరు అందర్నీ నోట్ చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బిజెపి జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొని ర్యాలీ నిర్వహించడం జరిగింది.





0 Comments