మేయర్‌గా నగర అభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషించాలి* *ముక్క శ్రావణికి గంట్ల శ్రీనుబాబు శుభాకాంక్షలు*


విశాఖపట్నం, నవంబర్ 3:గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణికి డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు శుభాకాంక్షలు తెలిపారు.

విశాఖ నగర అభివృద్ధిలో ముక్క శ్రావణి ప్రత్యేక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నగర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. విశాఖను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు.

Post a Comment

0 Comments