శ్రీ సత్య సాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా *శ్రీ సత్య సాయి సేవా సంస్థలు & ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యం లో "దేశం లోనే మొట్టమొదటి ఉచిత చైల్డ్ కేర్ టేకర్ శిక్షణా కార్యక్రమం(ఉచిత బాలల సంరక్షణ సహాయకుల శిక్షణ కార్యక్రమం)" విశాఖలో ప్రారంభం*


విశాఖపట్నం ;నైపుణ్యాలతో మహిళలకు సాధికారత.. స్వావలంబన దిశగా  శ్రీ  సత్యసాయి  సేవా సంస్థల కృషి: శ్రీ ఆర్. లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ”

మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి, వారు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబులుగా ఎదగడానికి దోహదపడే లక్ష్యంతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత చైల్డ్ కేర్ టేకర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్(ఉచిత బాలల సంరక్షణ సహాయకుల శిక్షణ కార్యక్రమం) సోమవారం విశాఖపట్నంలోని ఎండాడ లోని  శ్రీ సత్యసాయి మహిళా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న  శ్రీ సత్య సాయి సేవా సంస్థల  రాష్ట్ర అధ్యక్షులు  శ్రీ ఆర్. లక్ష్మణరావుజ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం లో పాల్గొంటున్న ట్రైనీస్ ని ఉద్ద్దేశించి  శ్రీ ఆర్. లక్ష్మణరావు  మాట్లాడుతూ, మహిళలు తమకు అందుబాటులో ఉన్న ఇటువంటి నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని, కొత్త నైపుణ్యాలను అభ్యసించడం ద్వారా తమ కుటుంబాలకు, సమాజానికి మరింత ప్రయోజనకరంగా నిలవాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నైపుణ్యం, ఉపాధి, ఆత్మవిశ్వాసం, స్వావలంబన కల్పించే దిశగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్, భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తాయని శ్రీ ఆర్. లక్ష్మణరావు  తెలిపారు. దేశ వ్యాప్తంగా అనేక ఉచిత  స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్  శ్రీ సత్య సాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్నాయి. అయితే, దేశం లోనే మొదటిసారిగా,   శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) సహకారంతో  ఉచిత చైల్డ్ కేర్ టేకర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఈ రోజు విశాఖపట్నం లో ప్రారంభించినట్లు శ్రీ లక్ష్మణ రావు తెలిపారు.   

మహిళలకు ఒక ఉపయోగకరమైన నైపుణ్యాన్ని అందించడం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైన భాగమని ఆయన పేర్కొన్నారు. “Learn • Transform • Serve” అనే స్ఫూర్తితో మహిళలు నైపుణ్యాలను అభ్యసించి, ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం లో పాల్గొంటున్న మహిళలకు  శ్రీమతి యువతా రెడ్డి  ప్రత్యేక నాపుణ్య శిక్షణ ఇస్తారు. 


ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నశ్రీమతి కమలా త్రివేణి,   శ్రీ కె. దినేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్; శ్రీ ఎన్. గోవిందరావు, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్; డా. ఎం. మాధవి, ఎం.డి. (Fellowship in గెరియాట్రిక్); ప్రముఖ చిన్న పిల్ల వైద్యురాలు  డా. రజనీ ముఖర్జీ, ఎం.డి. (Paediatrician) తదితరులు మాట్లాడుతూ మహిళల స్వావలంబన, ఉజ్వల భవిష్యత్తు కోసం నాణ్యమైన, సమాజ అవసరాలకు అనుగుణమైన ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల కృషిని అభినందించారు. బాలల సంరక్షణ రంగంలో చైల్డ్ కేర్ టేకర్లకు సమాజంలో మంచి డిమాండ్ ఉన్నందున, ఈ శిక్షణా కార్యక్రమం మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించి, వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తుందని వారు పేర్కొన్నారు.

మొత్తం 360 గంటల పాటు కొనసాగే ఈ శిక్షణా కార్యక్రమంలో 19 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళలకు   2 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల సంరక్షణకు సంబంధించిన వివిధ నైపుణ్యాలను మహిళలకు అందించనున్నారు.

శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ధ్రువీకృత సర్టిఫికెట్ అందజేయబడుతుంది. ఈ ధ్రువపత్రం భవిష్యత్తులో ఉపాధి, జీవనోపాధి అవకాశాలను పొందేందుకు ఉపయోగపడనుంది.


ఈ సందర్భంగా విశిష్ట  అతిధులు మాట్లాడుతూ చైల్డ్ కేర్‌లో శిక్షణ పొందిన మహిళలు బేబీ కేర్ సెంటర్లు, ఆసుపత్రులు, కిండర్ గార్టెన్లు, డే కేర్ సెంటర్లు, అలాగే ఇంటి వద్ద పిల్లల సంరక్షణ సేవలు వంటి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలను పొందేందుకు ఈ శిక్షణ దోహదపడుతుంది అని, ముఖ్యంగా నిరుద్యోగ మహిళలు, ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్న మహిళలు మరియు కొత్త నైపుణ్యాన్ని అభ్యసించి ఉపాధి పొందాలనుకునే వారికి ఈ కార్యక్రమం ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది అని తెలియచేసారు. 

ఎటువంటి రుసుము లేకుండా, సేవా దృక్పథంతో, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మరియు APSSDC సహకారంతో  పూర్తిగా ఉచితంగా ఈ నైపుణ్య శిక్షణ  అందిస్తున్నారు.


ఈ కార్యక్రమం లో శ్రీమతి కమలా త్రివేణి ,  శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, విశాఖపట్నం, శ్రీ సత్యసాయి సేవా సంస్థల స్కిల్  డెవలప్మెంట్ ప్రోగ్రాం  (SDP) విభాగంరాష్ట్ర సమన్వయకర్తలు శ్రీమతి అమ్మాజీ, శ్రీ కె నాగప్రసాద్, విశాఖ జిల్లా సేవా విభాగం సమన్వయకర్త శ్రీ ఆర్ ఏ నాయుడు , సిటీ సేవా సమితి కన్వీనర్ శ్రీ బి సాయికుమార్ , శ్రీ సత్య సాయి సేవా సంస్థల స్కిల్ డెవలప్మెంట్ విభాగం  విశాఖ జిల్లా సమన్వయకర్తలు శ్రీమతి అపర్ణ, శ్రీ సత్యనారాయణ , సమితి కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్లు, ఇతర పదాధికారులు, భక్తులు పాల్గొన్నారు.                

ఈ సందర్భంగా శ్రీ ఆర్ లక్ష్మణ రావు శ్రీమతి కమలా త్రివేణి గారితో కలిసి "బాల సేవిక మరియు EHV   (ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ) కరదీపిక ను రిలీజ్ చేసారు.  ఈ కరదీపిక “బాలలే భావి భారత పౌరులు. ప్రేమతో, మానవ విలువలతో వారిని తీర్చిదిద్దడం మన పవిత్రమైన బాధ్యత అని , చిన్నపిల్లలను సంరక్షించడం అనేది అత్యంత అర్థవంతమైన సేవా బాధ్యతలలో ఒకటి. బాల్యంలో ఏర్పడే అలవాట్లు, ప్రవర్తన మరియు వ్యక్తిత్వ లక్షణాలు, పిల్లలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన, ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని కల్పిస్తూ, సహనం మరియు అవగాహనతో వారి ఎదుగుదలకు తోడ్పడటం ఎంతో అవసరంఅన్న విషయాలను చక్కగా వివరిస్తుంది. 

ఈ పుస్తక రూపకల్పనలో  గాయత్రి మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సి.హెచ్. పద్మావతి (ఎం.డి., కమ్యూనిటీ మెడిసిన్) గారు, బాలవికాస్ గురువు శ్రీమతి బి. శ్రీదేవి గారి కృషిని  శ్రీ ఆర్ లక్ష్మణ రావు అభినందించారు.   


ముందుగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రేమ తరువు (Prema Tharu) జాతీయ  ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా, శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు మరియు శ్రీమతి కమల త్రివేణి గారు శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రాంగణంలో ఔషధ మొక్కలను(మెడిసినల్ ప్లాంట్స్ ) నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజ ఆరోగ్యానికి దోహదపడే ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

విశిష్ట అతిధులను శ్రీ ఆర్ లక్ష్మణ రావు, శ్రీమతి కమలా త్రివేణి దంపతులు సన్మానించారు. 





Post a Comment

0 Comments